సింగపూర్ ఆర్థికమంత్రితో చంద్రబాబు భేటీ-పెట్టుబడులే ప్రధాన లక్ష్యం.

Chandra Bau Nidu

సీఎం చంద్రబాబు గారు కొన్ని రోజులుగా సింగపూర్‌లో ప్రయతిస్తున్న సంగతి తెలిసేందే, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఈ రోజు అయన సింగపూర్ ఆర్థికమంత్రి హుంగ్ స్వీకేట్‌తో భేటీ అయ్యారు.అన్ని రకాల పౌర సేవలను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకువచ్చామని, ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించామని, సెన్సార్ల ఆధారిత వీధి దీపాల వ్యవస్థను రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. రైతులకు వాతావరణ సూచనలను ఇస్రో సహకారంతో తెలియచేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.

చాల దిగ్గజ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయని, ఇప్పటికే కియా మోటార్స్‌ రెండు బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టిందని సీఎం చంద్రబాబు వివరించారు. తమ వ్యాపారాల్లో సింగపూర్‌ కూడా భాగస్వామిగా వుండాలని, తక్కువ వడ్డీతో సింగపూర్‌ సంస్థలు రుణాలు ఇచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు వినతి చేశారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *