విదేశీ టూరిస్టులకు ఉచిత సిమ్ కార్డులు పంపిణీ నిలిపివేత – భారత ప్రభుత్వం

Foreign tourists

విదేశీ పర్యాటకుల కోసం గతేడాది ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సిమ్‌లు పథకాన్ని నిలివేస్తున్నట్టు టూరిజం సెక్రటరీ రష్మీ వర్మ తెలిపారు. ఈ పథకం వారికీ అంతగా అవసరం లేదన్న ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ఎత్తివేస్తున్నట్టు చెప్పారు. పర్యాటకుల్లో చాలామంది సోషల్ మీడియా యాప్స్‌ను వాడుతున్నారని, అలాగే, చాలా ప్రాంతాల్లో పబ్లిక్ వైఫై అందుబాటులో ఉండడంతో దానిని ఉపయోగించుకుని వారి కుటుంబాలతో నిత్యం టచ్‌లో ఉంటున్నారని వర్మ తెలిపారు.

భారత టెలికాం సమస్త బీఎస్ఎన్ఎల్ ఈ సిమ్ కార్డులను పంపిణి చేస్తుంది, ఈ పథకంలో భాగంగా 50 రూపాయల టాక్‌టైమ్, 50 ఎంబీల డేటా, 30 రోజుల కాలపరిమితి ని కలిపిస్తుంది. గతసంవత్సరం భారత్ సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య కోటి పైనే అని సమాచారం.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *