
పోలవరం ప్రాజెక్ట్ పనులకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. పోలవరం పనుల నిలిపివేత ఆదేశాలపై ఉన్న స్టే ను మరో సంత్సరంపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ విషయమై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతో పోలవరం పనులకు ఎలాంటి అడ్డంకి తలెత్తకుండా మార్గం తేలిక అయింది.