
కృష్ణా జిల్లా నందిగామలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా మారింది. తమ డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కార్మికుల గత 12 రోజులుగా సమ్మెతో నగరంలో చెత్తా చెదారం భారీగా పేరుకుపోయింది. దీంతో మున్సిపల్ అధికారులు ప్రైవేట్ వ్యక్తులను రంగంలోకి దింపి పనిచేయుస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కార్మికులు పనులను అడ్డుకుని గొడవలకుకు దిగారు. దీనితో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడకు చేరుకుని కార్మికులను అడ్డుకున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట మున్సిపల్ కార్మికులు ఆందోళనకు చేస్తున్నారు.