ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ

Actor Sivaji’s Sensational Comments on Operation Garuda
ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ
వైసీపీ అధినేత జగన్‌పై దాడి విషయంలో ఆపరేషన్ గరుడలో హీరో శివాజీ చెప్పినట్లే జరగడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఆపరేషన్ గరుడలో భాగంగా తర్వాత ఏం జరగబోతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో హీరో శివాజీ స్పందించారు..

‘‘ ఏదో విధంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలదోయాలన్న కుట్ర జరుగుతోంది.. ఈ మూడు నెలల్లో సీఎంను కూలదోస్తారు’’ అని శివాజీ అన్నారు. జగన్‌పై దాడి ఘటనపై విచారణ జరగాల్సిందేనని.. రాష్రప్రభుత్వంపై నమ్మకం లేకపోతే కేంద్రమే విచారణ చేపట్టాలన్నారు..

ALSO READ : మరోసారి భావోద్వేగానికి గురైన సీఎం
జగనన్న అందుకే నిన్ను పొడిచేసా….

కేంద్ర భద్రతా దళాల పరిధిలో జరిగిన దాడి కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపించుకోవచ్చునని శివాజీ అభిప్రాయపడ్డారు. జీవీఎల్‌కు ఏం తెలుసని మాట్లాడుతున్నారంటూ శివాజీ మండిపడ్డారు. సీఎం చంద్రబాబుది దాడులు చేయించే మనస్తత్వం అయితే ఇంత వరకూ రాదని అన్నారు..

తన రాష్ట్రంపై కుట్రలు జరిగినా.. తప్పులు జరిగినా బయటపెట్టడం తన హక్కు అని శివాజీ స్పష్టం చేశారు. తన రాష్ట్రంపై అభిమానంతో సినీ జీవితాన్ని సైతం పక్కనబెట్టి.. ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నానని తెలిపారు. తనకు ఏ పార్టీలతో సంబంధం లేదన్నారు… ఆపరేషన్ గరుడ గురించి ప్రజలకు క్లారిటీ ఉందని రాష్ట్రం మొత్తం దాని గురించే చర్చించుకుంటున్నారని శివాజీ స్పష్టం చేశారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *